fbpx
HomeMovie Newsఏప్రిల్ 30 న విరాట పర్వం

ఏప్రిల్ 30 న విరాట పర్వం

Rana ViraataParvamMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: దగ్గబాటి రానా , సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విరాట పర్వం. శ్రీ విష్ణు తో ‘నీది నాది ఒకే కథ’ సినిమా రూపొందించిన వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పూర్తిగా నాచురాలిటీ కి దగ్గర్లో ఈ సినిమా రూపొందింది. 1990 దశకం లో జరిగిన ఒక నక్సలైట్ కథని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులని ప్రతిబింబించేలా కొన్ని సెట్స్, సీన్స్ రూపొందించారు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. నీది నాది ఒకే కథ సినిమా లానే ఈ సినిమా కూడా ఒక మంచి ఫీల్ కలిగిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

కామ్రేడ్ రవి అన్న పాత్రలో కనిపించనున్న రానా ఈ సినిమా విడుదల తేదీ ని ఇవాళ ప్రకటించారు. ఏప్రిల్ 30 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు. ఈ సినిమాలో రానా కి ఎంత మంచి పాత్ర ఉందో , సాయి పల్లవి పాత్ర అంత కన్నా బాగుంటది అని ఒక ఇంటర్వ్యూ లో రానా తెలియ చేసారు. రిలీజ్ పోస్టర్ కూడా సాయి పల్లవి ఫోటో ద్వారా ఒకటి విడుదల చేసారు. ఈ సినిమాలో ప్రియమణి, నివేత పేతురాజ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular