fbpx
HomeMovie News'పుష్ప' రిలీజ్ డేట్ ప్రకటించిన బన్నీ

‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన బన్నీ

AlluArjun PushpaMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: ‘అల వైకుంఠపురం లో’ ఇచ్చిన సక్సెస్ తర్వాత బన్నీ తనకి మొదటి హిట్ ఇచ్చిన సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఎలా అయినా సూపర్ హిట్ చెయ్యాలని ఇటు బన్నీ అటు సుకుమార్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా చాలా రోజులు షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా నెల క్రితం షూటింగ్ మొదలయింది. అప్పుడే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించి ఆశ్చర్య పరిచాడు బన్నీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 13 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా సౌత్ ఇండియా భాషలతో పాటు హిందీ లో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బన్నీ కి జోడీ గా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు. పూర్తి రగ్గడ్ లుక్ లో ఉన్నాడు. ఈ రోజు రిలీజ్ పోస్టర్ లో చూస్తే బన్నీ లుక్ ఎంత రా గా ఉందో అర్ధం అవుతుంది. చేతిలో గొడ్డలి పట్టుకుని, గుబురు గడ్డం తో, పాత చెప్పులు వేసుకుని, డి గ్లామర్ రోల్ లో ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో ‘ఆర్య’, ‘ఆర్య-2 ‘ సినిమాల తర్వాత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి హ్యాట్రిక్ కొట్టే ఆలోచన లో బన్నీ, సుక్కు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular