మూవీ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇటీవలే ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కొడుకుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టింది. అయితే తన కొడుకు రాకతో కాజల్ కుటుంబం ఎంతో సంతోషంలో మునిగితేలుతోంది.
ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. అయితే తన ప్రెగ్నెన్సీ కారణంగా ‘ఆచార్య’ మూవీతో పాటు అప్పటికే సైన్ చేసిన పలు ప్రాజెక్ట్స్ నుంచి కూడా కాజల్ తప్పుకుంది.
అప్పట్లో ఈ వార్తలతో కాజల్ పూర్తి కుటుంబంపై దృష్టి పెట్టాలనుకుంటోందని, అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాజల్ కూడా వీటిపై పెద్దగా స్పందించకపోవడంతో అంతా నిజమే అని కూడా అనుకున్నారు.
కాగా ఇప్పుడు ఆమె తిరిగి సినిమాల్లో నటించదానికి సిద్ధం అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బొద్దుగా తయారైన కాజల్ బిడ్డ పుట్టిన తరువాత మళ్ళీ నాజుగ్గా తయారవుతున్నట్లు తెలుస్తోంది.