fbpx
HomeMovie Newsప్రభాస్ సరసన శృతి హాసన్

ప్రభాస్ సరసన శృతి హాసన్

ShruthiHasan WithPrabhasIn Salaar

టాలీవుడ్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలని ప్లాన్ చేసాడు. అందులో కే.జి.ఎఫ్ సినిమా తో అందరి దృష్టిని ఆకర్షించిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వం లో ‘సలార్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా నుండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈరోజు శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా శృతి హాసన్ కి విషెస్ తెలియచేస్తూ ఈ విషయాన్ని అనౌన్స్ చేసారు ఈ సినిమా టీం.

కే.జి.ఎఫ్ సినిమాని రూపొందించిన హోంబేలె ఫిలిమ్స్ ఈ సినిమాని రూపొందిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ కొంచెం ఓల్డ్ గెట్ అప్ లో కనిపించదు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ రోల్ కనిపించనున్నట్టు డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. ఆల్రెడీ క్రాక్ ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న శృతి హాసన్ ఈ సినిమా ఆఫర్ తో మళ్ళీ బిజీ హీరోయిన్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కూడా శృతి హాసన్ నటించింది. ఈ సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular