fbpx
HomeMovie News30 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న వరుణ్ తేజ్

30 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న వరుణ్ తేజ్

TwoMoviesOfVaruntej Releasing WithinAMonth

టాలీవుడ్: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘గని’ అనే సినిమా సిద్ధం చేసాడు. బాక్సింగ్ నేపధ్యం లో ఈ సినిమా రాబోతుంది. దేశం లో బాక్సింగ్ ఎందుకు వెనకబడి ఉంది, ఈ ఆట ఇంకా ఎందుకు ఫేమస్ అవట్లేదు లాంటి అంశాలు ఈ సినిమాలో చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు మూవీ మేకర్స్. మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ ఇదివరకు బాక్సింగ్ నేపధ్యం లో ‘తమ్ముడు’ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ప్రకటించారు. ఈ సినిమాని 30 జులై న విడుదల చేయనున్నట్టు ఈరోజు ప్రకటించారు.

2019 సంక్రాంతి కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘F2 ‘. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి పెళ్ళైన మొగుళ్ళ కష్టాలు చూపించి ఈ సినిమా మొత్తం అందర్నీ నవ్వించారు ఈ ఇద్దరు హీరోలు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ‘F3 ‘ సినిమా రూపొందుతుంది. ఈ మధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా టీం అనూహ్యంగా విడుదల తేది కూడా ప్రకటించి ఆశ్చర్య పరచింది. ఆగష్టు 27 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు ఈ సినిమా టీం ప్రకటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. వరుణ్ తేజ్ నుండి రాబోతున్న ఈ రెండు సినిమాలు దాదాపు 30 రోజుల కన్నా తక్కువ తేడా లోనే విడుదల అవబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular