fbpx
HomeMovie Newsదీపావళి బరిలో రజినీకాంత్

దీపావళి బరిలో రజినీకాంత్

Rajinikanth AnnatheMovieFor DeepawaliRelease

కోలీవుడ్: రజినీకాంత్ స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు అని ఒక సినిమాని అన్ని బాషల ప్రేక్షకులు చూసే విధంగా రూపొందిస్తున్నారు కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఒక తమిళ హీరో సినిమా వివిధ భాషల్లో డబ్ అయ్యి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. కేవలం భారత దేశం లోనే కాకుండా ఏషియా లోని వివిధ దేశాల్లో రజిని కాంత్ కి ఎప్పటి నుండో మార్కెట్, ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం రజిని కాంత్ ‘అన్నాథే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 4 న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

తెలుగు లో రవి తేజ తో ‘దరువు’, తమిళ్ లో అజిత్ తో ‘విశ్వాసం’, ‘వేదాళం’,’వివేకం’ లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిథి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డి.ఇమాన్ మొదటి సారి రజినీకాంత్ కి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ముత్తు సినిమా తర్వాత దాదాపు 25 సంవత్సరాలకి రజినీకాంత్ దీపావళి పోరులో తన సినిమాని విడుదల చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular