టాలీవుడ్: ‘ప్రస్థానం’ లాంటి ఒక సినిమా చాలు ఆ సినిమా డైరెక్టర్ ‘దేవా కట్ట‘ ఎలాంటి ప్రతిభా వంతుడో చెప్పడానికి. ఇన్ని సంవత్సరాలైనా అలాంటి ఒక్క హిట్ కూడా ఈ డైరెక్టర్ కి పడలేదు. మధ్యలో ఆటో నగర్ సూర్య సినిమా తో కొంతవరకు మెప్పించినా కూడా చాలా బడ్జెట్ పరమైన కారణాల వలన ఆ సినిమా అసంపూర్తిగా తయారైన ప్రోడక్ట్ లా అనిపించి జనాలు ఎక్కువగా ఆదరించలేదు. ఇన్నిరోజులు తర్వాత మరో స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ పొలిటికల్ సబ్జెక్టు తో వస్తున్నాడు ఈ డైరెక్టర్.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమాని ‘రిపబ్లిక్’ అనే పేరుతో రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ‘ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు,శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు, ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులను ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది- ప్రభుత్వం అవుతుంది- అదే అసలైన రిపబ్లిక్’ అంటూ సాయి ధరమ్ తేజ్ వాయిస్ లో ఒక వీడియో విడుదల చేసారు. ‘ఆటో నగర్ సూర్య’ టైం లో కూడా చైతూ వాయిస్ తో ఒక వీడియో ఇలానే విడుదల చేసారు దేవా కట్ట. ఈ వీడియో లో వాయిస్ అంతగా ఆకట్టుకోకపోయిన డైలాగ్ లో అదే కసి కనిపిస్తుంది.
ఈ సినిమాలో మరిన్ని ముఖ్య పాత్రలో ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయిన జగపతి బాబు మరియు రమ్య కృష్ణ నటిస్తున్నారు. వీరితో పాటు మరో టాప్ మోస్ట్ తమిళ్ ఆక్టర్ ‘ఐశ్వర్య రాజేష్’ సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా నటిస్తుంది. ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత దేవా కట్టా సినిమాకి అన్నీ కుదిరినట్టనిపిస్తుంది. ఈ సమ్మర్ లో ఈ సినిమా విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ సాధించి దేవా కట్టా లాంటి డైరెక్టర్ ద్వారా మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.