ఖాట్మండు: నేపాల్ లో కుప్పకూలిన విమానం ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో శౌర్య ఎయిర్ లైన్స్ కు సంబంధించిన కమర్షియల్ విమానం స్కిద్ అయి ఫెన్సింగ్ ను డికొట్టింది.
వెంటనే మంటలు చేలరేగగా విమానం మొత్తం దహనమైంది. కాగా, అందులో 19 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయాల పాలైన పైలట్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.