fbpx
HomeMovie Newsమహానటి మొదటి తెలుగు సినిమా 'రెండు జళ్ల సీత' టీజర్

మహానటి మొదటి తెలుగు సినిమా ‘రెండు జళ్ల సీత’ టీజర్

KeerthiSuresh RenduJellaSeetha TeaserReleased

టాలీవుడ్: మహానటి కీర్తి సురేష్ తెలుగు లో రామ్ తో కలిసి ‘నేను శైలజ’ అనే సినిమా ద్వారా పరిచయం అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ సినిమా కంటే ముందే సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ తో ఒక సినిమా చేసింది. చాలా కారణాల వలన ఈ సినిమా ఇన్ని రోజులుగా విడుదలకి నోచుకోలేదు. మధ్యలో రెండు సార్లు టైటిల్ మార్చారు కానీ విడుదల ఐతే అవలేదు. ప్రస్తుతం ఈ సినిమాని ‘రెండు జెళ్ళ సీత’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని ఇవాళ విడుదల చేసారు.

టీజర్ మొత్తం ఒక లవ్ స్టోరీ, ఒక బ్రదర్ – సిస్టర్ రిలేషన్ షిప్ మధ్యలో అడ్డం వచ్చే విలన్.. ఒక రొటీన్ కథలానే అనిపించింది. నాగబాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. నాగబాబు తో జబర్దస్త్ కామెడీ చూపించినట్టు టీజర్ లో తెలుస్తుంది. విలన్ రాహుల్ దేవ్ తాను ఇంతవరకు చేయని పాత్రని ఈ సినిమాలో చేసినట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా కీర్తి సురేష్, నాగ బాబు పేర్ల మీదనే ప్రమోట్ చేస్తున్నారు. రషెస్ చూసుకుని ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular