fbpx
HomeMovie Newsవసంత కోకిల: రేజ్ అఫ్ రుద్ర

వసంత కోకిల: రేజ్ అఫ్ రుద్ర

BobbySimha RageOfRudraFrom VasanthaKokila

కోలీవుడ్: తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాకి మాతృక అయిన జిగర్తాండ సినిమాలో విలన్ గా నటించి నేషనల్ అవార్డు పొందిన నటుడు బాబీ సింహ. తెలుగు లో కూడా డిస్కో రాజా సినిమాతో పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ఈ నటుడు హీరోగా ‘వసంత కోకిల’ అనే త్రిభాషా చిత్రం రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమాలో బాబీ సింహా కి సంబందించిన వీడియో ఒకటి విడుదల చేసారు. ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో బాబీ సింహా నటిస్తున్నాడు. రేజ్ అఫ్ రుద్ర అనే పేరుతో ఈ వీడియో విడుదల చేసారు.

వీడియో లో ఒక అడవిలో కార్ లో వస్తున్న హీరో ఒక పాడుపడ్డ ఇంటి ముందు ఆగి స్టైలిష్ గా చేతిలో ఒక వెపన్ తో దిగుతాడు. దిగగానే తన దగ్గర ఉన్న వెపన్ నుండి అస్త్రాన్ని ఆ ఇంటి వైపు వదులుతాడు. వీడియో మొత్తం లో నైట్ విజన్ లో కార్, ఫారెస్ట్, రైన్ లో కార్ నుండి బాబీ సింహా దిగే సీన్స్ టెక్నికల్ గా ఆకట్టుకున్నాయి. ప్రతి విజువల్లో సినిమాటోగ్రాఫర్ పనితనం కనిపిస్తుంది. రమణన్ పురుషోత్తమ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. డిస్కో రాజా సినిమాని రూపొందించిన ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే రజిని తాళ్లూరి మరియు రేష్మి సింహా నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ‘ప్రేమమ్’ లాంటి సినిమా తర్వాత రాజేష్ మురుగేషన్ ఈ సినిమాకే సంగీతం అందిస్తుండడం మరో విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular