fbpx
HomeMovie Newsనాని 'టక్ జగదీశ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్

నాని ‘టక్ జగదీశ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

TakJagadeesh FirstSingle Released

టాలీవుడ్: నాని హీరోగా ప్రస్తుతం ‘టక్ జగదీశ్’ అనే సినిమా రూపొందుతుంది. ఏప్రిల్ లో విడుదలవబోతున్న ఈ సినిమాకి పోస్టర్స్ తో ప్రచారం మొదలు పెట్టారు. ప్రస్తుతం మొదటి పాటని విడుదల చేసి ప్రచారం జోరు చూపిస్తున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ లని రూపొందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. షైన్ క్రియేషన్స్ బ్యానర్ లో గారపాటి సాహు, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని కి జోడీ గా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు, మరో ప్రత్యేక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.

శివ నిర్వాణ ఇదొక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ లాగ రూపొందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ సాగే ఈ పాటని విడుదల చేసారు. సాంగ్ మొదట్లో నాని హీరోయిన్ ని నిక్ నేమ్ తో పిలిచే విధానం దానికి రీతూ వర్మ ఎక్సప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. థమన్ అందించిన సంగీతం , శ్రేయ గోషాల్ వాయిస్ ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 16 న ఈ సినిమా విడుదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular