fbpx
HomeMovie Newsమార్చ్ 19 న శ్రియ 'గమనం'

మార్చ్ 19 న శ్రియ ‘గమనం’

ShriyaSaran GamanamMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: సౌత్ ఇండియా సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ ప్రస్తుతం ‘గమనం’ అనే బహు బాషా చిత్రంలో నటించింది. ఈ సినిమాకి సంబందించిన ప్రచార చిత్రాలు, టీజర్ ఆకట్టుకున్నాయి. మూడు నాలుగు కథలని ప్రెసెంట్ చేసి వాటికి ఒక కామన్ లింక్ పెట్టి చివర్లో ఆ కథలన్నిటికి ఒక ఫినిష్ ఇచ్చే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగు లో ఇదివరకు ‘మనమంతా’, ‘ఓం శాంతి’ లాంటి సినిమాలు వచ్చాయి. ఇపుడు ఈ సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే రానుంది.

ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించింది సినిమా టీం. మార్చ్ 19 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారాడు, రమేష్ కరుటూరి మరియు వెంకీ పుషాదపు తో కలిసి కాళీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుజనా రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో చారు హాసన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ , సుహాస్ నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular