fbpx
HomeMovie Newsముగ్గురు మ్యూజిక్ కంపోజర్స్ తో రానున్న 'రాధే శ్యామ్'

ముగ్గురు మ్యూజిక్ కంపోజర్స్ తో రానున్న ‘రాధే శ్యామ్’

ThreeMusicDirectors ComposingFor PrabhasRadheShyam

టాలీవుడ్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’. పూర్తి రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఫిబ్రవరి 14 న సినిమాకి సంబందించిన టీజర్ తో పాటు విడుదల తేదీ అప్డేట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ సినిమా టీం నుండి ఒక కొత్త ప్రకటన వెలువడింది. ఈ సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయబోతున్నట్టు సినిమా టీం ప్రకటించింది. అయితే ముగ్గురు కంపోజర్లు ఒకే భాషలో కాకుండా వేరు వేరు భాషల్లో కంపోజ్ చేయనున్నారు.

హిందీ వెర్షన్ కి మిథున్ మరియు మనన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. డియర్ కామ్రేడ్ లాంటి సూపర్ మ్యూజికల్ సక్సెస్ అందించిన జస్టిన్ కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన ప్రీ-టీజర్ లో కూడా జస్టిన్ ఇచ్చిన ఒక సింపుల్ కీ-బోర్డు బిట్ ఆకట్టుకుంది. పూర్తి వింటేజ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా మొత్తం ఒకప్పటి యూరప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే ప్లానింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular