fbpx
HomeMovie Newsసెప్టెంబర్ లో విడుదల కానున్న 'లైగర్'

సెప్టెంబర్ లో విడుదల కానున్న ‘లైగర్’

VijayDevarakonda LigerMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఈ సినిమాని బాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. అందుకోసం సినిమా ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ తో జత కలిసాడు, సినిమా షూటింగ్ ని ముంబై లో చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి మరియు కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

పూర్తిగా బాక్సింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్ నేపధ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కోసం విజయ్ కూడా చాలా రోజులు ట్రైనింగ్ తీసుకొని శ్రమించి ఈ సినిమా ద్వారా ఒక సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ కి జోడీ గా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుంది. ఈ ‘లైగర్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ ఇవాళ ప్రకటించింది సినిమా టీం. సెప్టెంబర్ 9 న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular