fbpx
HomeMovie Newsమోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్: 'గుచ్చే గులాబి' పాట విడుదల

మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్: ‘గుచ్చే గులాబి’ పాట విడుదల

GucheGulabiSong From MostEligibleBachelor

టాలీవుడ్: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ సినిమాలో నటిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికి మూడు సినిమాలు తీసి ఒక గట్టి సక్సెస్ కొట్టని ఈ హీరో ఈ సినిమా పైన చాలా అంచనాలు పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ లాంటి సినిమాలని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భాస్కర్ కూడా ఈ సినిమా ద్వారా ఒక మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జోడీ గా పూజ హెగ్డే నటిస్తుంది.

గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా నుండి ‘మనసా మనసా’ అంటూ సాగే మొదటి పాటని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నుండి వాలెంటైన్స్ డే సందర్భంగా ‘గుచ్చే గులాబీ’ అనే పాట విడుదలైంది. ఈ పాటని అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాటలో చూపించిన విజువల్స్ ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక స్టాండ్ అప్ కమెడియన్ అని అర్ధం అవుతుంది. అనంత్ శ్రీరామ్, మరియు శ్రీ మణి ఈ పాటకి సాహిత్యం అందించారు. GA2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 19 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular