fbpx
HomeMovie Newsథ్రిల్లర్ గా సుహాస్ 'ఫామిలీ డ్రామా'

థ్రిల్లర్ గా సుహాస్ ‘ఫామిలీ డ్రామా’

Suhas FamilyDrama Trailer

టాలీవుడ్: ఫ్రెండ్ కారెక్టర్ లలో నటిస్తూ కామెడీ, ఎమోషనల్ పాత్రలు చేస్తూ కలర్ ఫోటో సినిమా ద్వారా హీరో గా పరిచయం అయ్యాడు సుహాస్. సుహాస్ హీరో కాక ముందే ఇండస్ట్రీ లో నటన పరంగా టాక్ అఫ్ ఇండస్ట్రీ అయ్యాడు. సుహాస్ నటించిన ‘కళాకారుడు’ షార్ట్ ఫిలిం కి ఇండస్ట్రీ నుండి ఎంతో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం తనకి గుర్తింపు పెరగడంతో తన దగ్గరికి వచ్చిన కథల నుండి తన నటనని బయటకి తీసే పాత్రలతో దూసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు సుహాస్. సుహాస్ నటుడిగా నిన్ననే ‘ఫామిలీ డ్రామా‘ అనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఛష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. మెహర్ తేజ్ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

సినిమా ట్రైలర్ చూసాక ఇదొక థ్రిల్లర్ సినిమా అని థ్రిల్ అవడం మాత్రమే కాకుండా సుహాస్ పాత్ర తాలూకు నటన చూసాక థ్రిల్ అవడం మాత్రం ఖాయం. ఒక్క రెండు నిమిషాలకే ఇలా ఉంటే ఇంకా రెండు గంటల సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో సుహాస్ ఒక సైకో కిల్లర్ పాత్రలో కనపడనున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్ సీన్ లోనే కొంచెం నత్తి తో మాట్లాడే సీన్ చూపించి సుహాస్ యాక్టింగ్ ఈ సినిమాలో ఏ రేంజ్ లో ఉండబోతుందో అని హింట్ ఇచ్చారు. ఒక ఫామిలీ లో ఒక సైకో ఫాదర్ మరియు అతని కుమారుడు, భార్య మధ్య వచ్చే ఘర్షణలు చూపించారు. ఆ కుమారుడి ఫ్రెండ్ గా సుహాస్ రావడం, నాటకీయ పరిస్థుతుల మధ్య వరుస హత్యలు జరగడం చూపించి ఒక కొత్త రకమైన థ్రిల్లర్ మూవీ చూడబోతున్న ఫీల్ కలిగించారు మేకర్స్. ట్రైలర్ చూసాక ఒక్కసారిగా ఈ సినిమా పైన అంచనాలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular