fbpx
HomeMovie Newsమరో సినిమా ప్రకటించిన సుహాస్

మరో సినిమా ప్రకటించిన సుహాస్

Suhas NewMovie Announcement

టాలీవుడ్: యు ట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ పేరు తెచ్చుకుని సినిమాల్లో కమెడియన్, ఫ్రెండ్ పాత్రల్లో మెరిసి చాలా తొందరగా ఇండస్ట్రీ లో గుర్తింపు పొందాడు. హీరో గా తన స్నేహితుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘కలర్ ఫోటో’ అనే సినిమాతో మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా లాక్ డౌన్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరో గా చేస్తూనే తన దగ్గరికి వచ్చిన పాత్రలు కూడా చేస్తూ పోతున్నాడు. హీరోగా అన్ని ప్రాజెక్టులు చేయకుండా కథాపరమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. చాయ్ బిస్కెట్ వారి మొదటి ప్రొడక్షన్ లో ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాలో కూడా సుహాస్ హీరో గా నటిస్తున్నాడు.

ఈ రోజు సుహాస్ హీరో గా మరొక సినిమా ప్రకటించారు. సినిమా ప్రకటనతో పాటు టైటిల్ మరియు సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ‘ఫామిలీ డ్రామా’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఒక ఫెన్స్ వెనక ఉన్న సుహాస్ లుక్ ని గ్రే షేడ్స్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో రక్తం కారుతున్న ఒక బ్లేడ్, వీల్ చైర్ లో కూర్చున్న ఒక పెద్ద వ్యక్తి మరియు రేడియో వింటున్న ఒక మధ్య వయస్కుడిని చూపించారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ చూస్తుంటే ఒక కొత్తరకమైన సినిమాలనే అనిపిస్తుంది. ఛష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. మెహర్ తేజ్ అనే దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి మిగతా వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular