fbpx
Saturday, April 27, 2024
HomeMovie Newsతిమ్మరుసు ప్రోమో సాంగ్ విడుదల

తిమ్మరుసు ప్రోమో సాంగ్ విడుదల

Thimmarusu PromoSong Release

టాలీవుడ్: లాక్ డౌన్ లో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాని ఓటీటీ లో విడుదల చేసి మంచి సక్సెస్ ని సాధించాడు సత్యదేవ్. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమా జులై 30 న థియేటర్లలో విడుదల అవనుంది. ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఒక ప్రోమో సాంగ్ రూపొందించి విడుదల చేసారు. ఈ పాటని సమంత విడుదల చేసారు.

పాట ఆరంభం లో సత్యదేవ్ వాయిస్ లో ఈ సినిమాలో లవ్ సాంగ్ అనుకున్నాం కానీ లాగ్ అయిందని తీసేసాం.. తర్వాత ఈమె గోల ఎక్కువ అయిందని హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ని చూపిస్తూ.. ఆ పాటనే ఇపుడు ప్రోమో సాంగ్ లాగ రూపొందించాం అని ప్రియాంక , సత్యదేవ్ మధ్య సంభాషణ చూపించి పాట స్టార్ట్ చేసారు. పాటని స్టైలిష్ గా రూపొందించారు. తిమ్మరుసు అంటూ సాగే ఈ పాటలో హీరో వ్యక్తిత్వానికి సంబందించిన లిరిక్స్ తో పాటు సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ అక్కడక్కడా జోడించి విడుదల చేసారు. పాటలో బ్రహ్మాజీ , వైవా హర్ష తో కొంత కామిక్ టచ్ ఇచ్చారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మరిన్ని పాత్రల్లో బ్రహ్మాజీ, రవి బాబు, ఝాన్సీ, వైవా హర్ష, అంకిత్ మరో ప్రత్యేక పాత్రలో అజయ్ నటిస్తున్నారు. ఈస్ట్ కాస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.మహేష్ కోనేరు మరియు సృజన యర్రబోలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిఖిల్ తో కిరాక్ పార్టీ సినిమాని డైరెక్ట్ చేసిన శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ నెల 30 న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి తర్వాత విడుదల అవ్వబొయె సినిమాలకి ఆశాకిరణం కావాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular