fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్

ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్

Prabhas RaadheShyam FirstLook Revelaed

హైదరాబాద్: ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రభాస్ #20 కి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పూజ హెగ్డే, ప్రభాస్ లను చూస్తుంటే ఇదొక లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది. ఫస్ట్ లుక్ తో పాటు మేకర్స్ కాస్టింగ్ కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవబోతోంది. అలాగే ఈ సినిమాని 2021 లో విడుదలకి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో సీనియర్ నటి భాగ్యశ్రీ (మైనే ప్యార్ కియా ఫేమ్ ), మురళి శర్మ, ప్రియదర్శి, సచిన్ ఖేడేకర్, షాషా ఛత్రి(ఎయిర్ టెల్ యాడ్ ఫేమ్), బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్(ఢిల్లీ బెల్లీ ఫేమ్), తమిళ నటుడు సత్యన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని, డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్ అని రూమర్స్ ఉన్నా కూడా ఇంకా ఏదీ తేలలేదు. ఫస్ట్ లుక్ తో అయినా తెలుస్తుంది అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఇంకా ఫస్ట్ లుక్ విషయానికి వస్తే ప్రభాస్ మరియు పూజాహెగ్డే గ్రాండియర్ లుక్ అదిరిపోయింది. ముందు నుంచి అనుకున్నట్టు గానే ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని అర్ధం అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లో యూరోప్ వింటేజ్ లుక్స్ మైమరపిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular