న్యూ ఢిల్లీ: రిలయన్స్ జియో పుణ్యమా అని ముఖేష్ అంబానీ ప్రపంచంలోని టాప్-10 సంపన్నుడు గా నిలిచాడు. బ్లూం బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ సంపద విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లకు చేరగా బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ 67.9 బిలియన్ డాలర్లను అధిగమించారు.
రిలయన్స్ జియో టెలికాం కంపెనీలో పెరిగిన పెట్టుబడుల వలన ముఖేష్ అంబానీ సంపద అపారంగా పెరిగింది. దీంతో ఆయన ప్రపంచంలోని సంపన్నులలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచంలోని టాప్-10 ధనవంతులలో ఆసియా ఖండం నుంచి నిలిచినది ఒక్క ముఖేష్ అంబానీ మాత్రమే.
ఇటివల బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, సీఈఓ అయిన వారెన్ బఫెట్ తన సంపదలో 37 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విరాళంగా ప్రకటించిన తరువాత, మరియ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను విరాళంగా ఒక స్వచ్చంద సంస్థకు ఇచ్చిన తరువాత తన నికర సంపద గణనీయంగా తగ్గింది.
హురున్ రీసర్చ్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ సంపన్న భారతీయుడుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మొదట్లో కాస్త నష్టాలు చవిచూసినప్పటికీ తరువాత జియోలో వరుస పెట్టుబడుల వలన ఆయన నికర ఆస్తి విలువ పెరుగుతూ వచ్చింది.
కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో కూడా తన కంపెనీ షేర్లు పెరుగుతూనే వచ్చాయి. ఈ సమయంలో అనూహ్య విధాంగా లాభాలు సాధించి అప్పులు లేని సంస్థగా అవతరించింది.
ఈ వారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చేరింది.