fbpx
Thursday, April 25, 2024
HomeBusinessభారత్ లో పెట్టుబడులకు ఎర్ర తివాచీ: నరేంద్ర మోడీ

భారత్ లో పెట్టుబడులకు ఎర్ర తివాచీ: నరేంద్ర మోడీ

invitation-to-invest-in-india

న్యూ ఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అనువైన దేశం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో సంస్కరణలు చేశామని ఇండియన్ గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద ఎకానమీ అయిన భారత్ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం అని, అటువంటి అంతర్జాతీయ కంపెనీలకు భారత్ లో వ్యాపారానికి అనువైన వాతావరణం, సరళమైన వాణిజ్య ప్రమాణాలు కల్పిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో అనేక సంస్కరణలు చేశామని, అనుమతులు కూడా సులభతరం చేశామన్నారు.

స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ అది ప్రపంచం తో సంబంధాలు తెంచుకున్నట్టు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటీకే దేశంలో రక్షణ, స్పేస్ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పలు సంస్కరణలు అమలు చేస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాట్లు తెలిపారు. దీని కోస ప్రపంచ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ తో ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అలగే భారత్ లో ఉన్న పెద్ద కంపెనీలకు సహాయం చేసె చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కుడా స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.

భరత్ లో ఉత్పాదకత, పోటీతత్వం పెంచుకుంటూ వ్యాపారం సాగించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే కొత్త రంగాలలో అపార అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో నిల్వ, రవాణా చేసే కార్యక్రమాలలో కుడా అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

కరోనా వైరస్ పై చేస్తున్న పోరాటంలో భారత్ అద్భుతంగా పని చేస్తోందని, భారత్ లోని పలు ఫార్మా కంపెనీలు చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఔషదాల్ని తయారు చేసి క్లీనికల్ ట్రయల్స్ కొనసాగిస్తున్నాయని, ఇది ప్రపంచానికే శుభ సూచకమన్నారు. టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకు వచ్చాక దాన్ని వేగంగా ప్రపంచానికి అందించే విషయంలో కూడా భారత్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇప్పటికే భారత్ కరోన విపత్తు సమయంలో ప్రపంచంలో పలు దేశాలకు కావలసిన మందులను అందించిందని గుర్తు చేశారు. భారత్ లో తయరైన బాలల వ్యాక్సినేషన్ ను ప్రపంచలోని చాలా దేశాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయని ఈ సంధర్భంగా ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular