fbpx
HomeMovie Newsవిడుదల తేదీ ప్రకటించిన దిల్ రాజు-క్రిష్ సినిమా

విడుదల తేదీ ప్రకటించిన దిల్ రాజు-క్రిష్ సినిమా

DilRajuAndKrishJagarlamudi Movie ReleaseDateAnnouncement

టాలీవుడ్: శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, శంకర్ లాంటి వాళ్ళతో పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు కూడా దిల్ రాజు చేస్తుంటాడు. అటు డైరెక్టర్ గా బిజీ గా ఉంటూనే అప్పుడప్పుడు మంచి కథలని ప్రోత్సహిస్తూ సినిమాలని నిర్మిస్తుంటాడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం దిల్ రాజు , క్రిష్ కలిసి నిర్మాణ భాగస్వాములుగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల హీరోగా ‘101 జిల్లాల అందగాడు’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.

రాచకొండ విద్యా సాగర్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ కి జోడీ గా రుహాణి శర్మ నటిస్తుంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకి హీరో మాత్రమే కాకుండా కథ కూడా అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. మే నెలలో సీనియర్ హీరోల ‘ఆచార్య’, ‘నారప్ప’, బాలకృష్ణ సినిమాలు విడుదలకి ముందు మే 7 న ఈ సినిమా విడుదల అవబోతున్నట్టు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular