fbpx
HomeMovie Newsచెక్: 'నిన్ను చూడకుండా' పాట విడుదల

చెక్: ‘నిన్ను చూడకుండా’ పాట విడుదల

NinnuChoodakunda SongLaunchedFrom NithinCheckMovie

టాలీవుడ్: వైవిధ్య చిత్రాల దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి దర్శకుడిగా నితిన్ హీరోగా రూపొందిన సినిమా ‘చెక్’. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల అవబోతుంది. ప్రొమోషన్ లో భాగంగా ఈ సినిమా నుండి ఏకైక పాట విడుదల చేసారు. ప్రియా ప్రకాష్ వారియర్ , నితిన్ మధ్య సాగే ఈ లవ్ సాంగ్ గోవా లో షూట్ చేసారు. కళ్యాణి మాలిక్ సంగీతం లో శ్రీ మణి లిరిక్స్ లో పాట ఆకట్టుకుంది. హరి చరణ్ మరియు శక్తి శ్రీ గోపాలన్ ఈ పాటని ఆలపించారు.

సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. టెర్రరిస్ట్ గా ముద్రపడిన ఒక వ్యక్తి జైలు లో చెస్ బాగా ఆడి చెస్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి జైలు నుండి ఎలా బయటపడతాడు అనేది సినిమా కథ అన్నట్టు అర్ధం అవుతుంది. ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లర్ సినిమాగా ఈ సినిమా రూపొందినట్టు అర్ధం అవుతుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వీ.ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 26 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular