fbpx
HomeMovie Newsధనుష్ 'కర్ణన్' ఫస్ట్ లుక్

ధనుష్ ‘కర్ణన్’ ఫస్ట్ లుక్

Dhanush KarnanMovie FirstLook

కోలీవుడ్: కోలీవుడ్ నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడు ధనుష్ ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించాడు. ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో కూడా ఒక పూర్తి విలేజ్ నేపధ్యం లో ఉండే పాత్ర చేయబోతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. తమిళ్ లో ‘పరియేఱుమ్ పెరుమాళ్’ లాంటి వైవిధ్యమైన సినిమా రూపొందించిన డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఈ సినిమా కూడా ఈయన దర్శకత్వంలో రాబోతుంది. ఫస్ట్ లుక్ లో బేడీ లు వేసుకుని చూస్తున్న ధనూష్ లుక్ ఆకట్టుకుంది.

వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని రకాల భాషల్లో ధనూష్ సినిమాలు చేస్తూ మరో మూడు సంవత్సరాల వారికి తన కాలెండర్ లో ఖాలీ లేకుండా బిజీ గా ఉన్నాడు. ధనుష్ లైన్ అప్ లో అన్న సెల్వరాఘవన్ తో యుగానికి ఒక్కడు -2 , బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో ఒక సినిమా, హాలీవుడ్ లో అవెంజర్స్ స్టార్స్ తో మరో సినిమా ఇలా భారీ సినిమాలు సిద్ధం చేస్తున్నాడు. ఇవే కాకుండా ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో రూపొందిన ‘జగమే తంత్రం’ సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular