fbpx
HomeMovie News'గుర్తుందా శీతాకాలం' ఫస్ట్ లుక్

‘గుర్తుందా శీతాకాలం’ ఫస్ట్ లుక్

Satyadev GurtundaSheethakaalam FirstLook

టాలీవుడ్: చాలా సంవత్సరాలుగా టాలీవుడ్ లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఒక ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తున్న సత్యదేవ్ లాక్ డౌన్ లో ఓటీటీ లో విడుదలైన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ హీరో ప్రస్తుతం ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా టీం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సత్యదేవ్ కి జోడీ గా సీనియర్ హీరోయిన్ తమన్నా నటిస్తుంది.

2020 ఆరంభం లో కన్నడ లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మోక్ టైల్ ‘ అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఒక ట్రాజిక్ ఎండింగ్ ఉండే ఈ సినిమా కన్నడ లో మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సినీ అభిమానుల హృదయాలకి ఆకట్టుకుకొనే సినిమాలాగా టాక్ సంపాదించింది. నాగ శేఖర్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భావన రవి, నాగ శేఖర్, చింతపల్లి రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో ద్వారా హిట్ కొట్టిన కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నాగశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు కూడా హీరో సత్యదేవ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular