fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsప్రభాస్ రాజు కి జోడి గా బాలీవుడ్ రాణి

ప్రభాస్ రాజు కి జోడి గా బాలీవుడ్ రాణి

DeepikaPadukone HeroineFor Prabhas21

హైదరాబాద్: నిన్న సడన్ సర్ప్రైజ్ అంటూ వైజయంతి మూవీస్ వారు ప్రభాస్ 21 గురించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాం, మీరు ఊహించినదానికంటే ఎక్కువే ఉంటుంది అని ఎక్స్ పెక్టషన్స్ పెంచారు. చెప్పినట్టు గానే ఇవాళ ఉదయం ప్రభాస్ 21 లో నటించే హీరోయిన్ ని ఆఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనె నటించబోతుంది. ఇదివరకే సాహో సినిమాకి బాలీవుడ్ నుండి శ్రద్దా కపూర్, రాధే శ్యామ్ కోసం పూజ హెగ్డే లాంటి వాళ్ళని బాలీవుడ్ నుండి తీసుకున్నట్టే ప్రభాస్ 21 కోసం కూడా బాలీవుడ్ నుండి దీపికా పదుకొనె ని సెలెక్ట్ చేసారు మేకర్స్.

‘వైజయంతీ మూవీస్ ఇన్నేళ్ళలో ఎంతోమంది ఎక్స్ట్రార్డినరీ ఉమెన్ తో వర్క్ చేసాం.. ఇప్పుడు ప్రభాస్ 21 కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ దీపికా పదుకొనేని తీసుకొస్తున్నాం’ అని ప్రకరించారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. ఈ విషయం పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ ‘ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనె చెయ్యడం నన్నెంతో ఎక్సయిటింగ్ కి గురి చేస్తోంది , ఈ సినిమాలో దీపికా, ప్రభాస్ మధ్య నడిచే కథ రానున్న రోజుల్లో ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేస్తుందని భావిస్తున్నా’ అని చెప్పారు. దీపికా పదుకొనె కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ ట్వీట్ చేశారు. ‘థ్రిల్ కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నా, మనం ఊహించిన దాని కన్నా మంచి జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా ‘ అన్నట్టు కథ తనని బాగా ఎక్సైట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. సైన్సు ఫిక్షన్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి RRR తర్వాత ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular