fbpx
Friday, June 2, 2023

INDIA COVID-19 Statistics

44,991,143
Confirmed Cases
Updated on June 2, 2023 6:18 pm
531,874
Deaths
Updated on June 2, 2023 6:18 pm
3,736
ACTIVE CASES
Updated on June 2, 2023 6:18 pm
44,455,533
Recovered
Updated on June 2, 2023 6:18 pm
HomeMovie Newsసూపర్ స్టార్ మెచ్చిన మరో సినిమా

సూపర్ స్టార్ మెచ్చిన మరో సినిమా

Maheshbabu Promotes OhMyKadavule Movie

హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా స్టార్స్ అందరూ గత నాలుగు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కొత్త స్క్రిప్టులు వినడం, చేస్తున్న సినిమా స్క్రిప్టుకి మెరుగులు దిద్దడం లాంటివి చేస్తున్న కూడా ఎక్కువ సమయం ఫ్రీగా గడుపుతున్నారు. కొందరు ఫ్యామిలి తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, కొందరు కిచెన్ లో కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇన్నాళ్లలో చూడని సినిమాలు, వెబ్ సిరీస్ లని ఇప్పడు వీక్షిస్తూ వాచ్ లిస్ట్ లో చెక్ పెట్టుకుంటున్నారు. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ తమకి బాగా నచ్చిన లేదా బాగా ఇంప్రెస్స్ చేసిన సినిమాని లేదా సిరీస్ ని అభిమానులకి కూడా సజెస్ట్ చేస్తున్నారు.

మహేష్ బాబు ఎవరిదైనా సినిమా నచ్చితే ఎవరు చెప్పకపోయినా కూడా ట్విట్టర్ లో తన సొంత నిర్ణయంతో ప్రమోట్ చేస్తుంటాడు. గతంలో తనకి నచ్చిన సినిమాలపై సూపర్ స్టార్ పాజిటివ్ గా స్పంధించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఒక తమిళ్ మూవీ కూడా నచ్చడంతో వెంటనే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు.ఈ మధ్యనే డార్క్ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘ఓ మై కడవులే’ అనే సినిమపై కూడా ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా బాగుంది. నటీనటుల యాక్టింగ్ అలాగే డైరెక్టర్ పనితనం కూడా అద్భుతంగా ఉందని ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా ఆ సినిమాపై తెలుగులో కూడా బజ్ మొదలైంది.అయితే ఇదివరకే ఆ వినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని పీవీపీ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాని తెలుగులో చేసే నటీ నటులు మాత్రం ఇంకా డిసైడ్ అవలేదు. అయితే మహేష్ లాంటి సూపర్ స్టార్ దగ్గరినుండి అద్భుతమైన ప్రశంస రావడంతో సినిమా టీం ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.

1 COMMENT

  1. Very good movie. Please watch it. routine ki binanga chesaru. telugu cinemalu mass ni vadili ilanti content tho ravali. orke entry songs, item songs leni cinemalu ravali.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular