మదనపల్లి: ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కీలక ఫైల్స్ దహనం కేసులో, వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మరియు వైసీపీ నేత అయిన మాధవ్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పోలీసులు ఈ పాటికే కుట్రకోణంపై నిర్ధారణకు వచ్చారు. సబ్ కలెక్టర్ ఆఫీసూలో ఫైల్స్ దహనం జరగడానికి ముందు పది రోజుల పాటు మాధవ్ రెడ్డి ఈ ప్రాంతంలో తిరిగినట్లు గుర్తించారు.
అలాగే, ఈ ఫైల్స్ దహనం కేసులో అతని పాత్ర ఉందని కూడా పోలీసులు నిర్ధారించారు. దీని వల్ల, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
కుట్ర కోణం పై ఆరా:
మాధవ్ రెడ్డి వరుసగా పది రోజుల పాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు? ఏయే ఫైల్స్‌కు సంబంధించి ఎవరెవరిని కలిశాడు? అనే వివరాలను పోలీసులు నిశితంగా పరిసీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్ర కారణంగానే జరిగినట్లు అనుమానిస్తున్నట్లు ప్రకటించారు.