fbpx
Wednesday, April 24, 2024
HomeMovie Newsప్రభాస్ 21 సర్ప్రైజ్

ప్రభాస్ 21 సర్ప్రైజ్

Prabhas21 Updatefrom VyjayanthiMovies

హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రభాస్ 20 అప్డేట్ కోసం ఫాన్స్ కళ్ళు కాయలు కాయలు కాసేలా ఎదురుచూసారు, చివరకి సినిమా మేకర్స్ ఐన UV క్రియేషన్స్ వాళ్ళని ట్రోల్ చేసే స్థాయికి వచ్చినా కూడా ఈ మధ్య ఆ సినిమా మేకర్స్ ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేసి సరిపెట్టుకున్నారు. కానీ ఎలాంటి వూహ గానాలు లేకుండా సడన్ గా ప్రభాస్ 21 మేకర్స్ అయిన వైజయంతి మూవీస్ వారు ఈ సినిమా గురించి రేపు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తమ అఫిషియల్ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

రాధే శ్యామ్ చిత్రం తరువాత ప్రభాస్ టాలెండెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని రూపొందించనున్నారు. ‘మహానటి’ చిత్రంతో దర్శకుడు నాగ్ అశ్విన్ స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. అద్భుత దృశ్య కావ్యంగానే కాకుండా చక్కని కథా, కథనాలతో ‘మహానటి’ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు నాగ్ అశ్విన్. ఇక ఈయన నెక్స్ట్ సినిమాను ప్రభాస్ కాంబినేషన్‌లో అనగానే అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ వచ్చి 10 రోజులు కాకముందే అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ జూలై 19 ఆదివారం 11 గంటలకు ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ ఉండబోతుందంటూ ట్వీట్ చేసింది వైజయంతీ మూవీస్. అలాగే మీరు ఎదురుచూపుకి డిసప్పాయింట్ అవకుండా ఉంటుంది అప్డేట్ అన్నట్టు చెప్పారు. ఫాన్స్ కూడా అడక్కుండానే అప్డేట్ ఇచ్చినందుకు వైజయంతి మూవీస్ ని పొగిడేస్తూ UV క్రియేషన్స్ వాళ్ళని మళ్ళీ తిట్టుకుంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular