fbpx
HomeMovie News'విరాట పర్వం' - రానా ఫస్ట్ లుక్

‘విరాట పర్వం’ – రానా ఫస్ట్ లుక్

DaggubaatiRana ViraataParvam FirstLook

టాలీవుడ్: దగ్గుబాటి మూడవ తరం వారసుడిగా ఇండస్ట్రీ కి అడుగుపెట్టి లీడర్ లాంటి ప్రయోగాత్మక మరియు సందేశాత్మక సినిమాతో కెరీర్ ప్రారంభించాడు రానా. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి సినిమాలు తీసి మెప్పించాడు. ఘాజి, బాహుబలి లాంటి సినిమాల ద్వారా పాన్ ఇండియా హీరోగా రూపుగాంచాడు. కేవలం హీరో గా మాత్రమే కాకుండా వ్యాఖ్యాత గా, ప్రొడ్యూసర్ గా రక రకాల క్రాఫ్ట్స్ లో తన పని తనాన్ని చూపించి తాతకి దగ్గ వారసుడు అనిపించుకున్నాడు . ఈరోజు రానా పుట్టిన రోజు సందర్భంగా రానా ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘విరాట పర్వం’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.

ఈ సినిమా ఒక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. చేతిలో గన్ పట్టుకొని అప్పటికే ముగిసిన ఒక రౌండ్ కాల్పుల పొగల్లోంచి హీరోయిక్ గా వస్తున్న రానా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ‘నీది నాది ఒకే కథ‘ లాంటి ఒక అద్భుతమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తర్వాత వెంటనే రానా తో ఈ సినిమా చేస్తున్నాడు వేణు ఊడుగుల. ఈ సినిమా కూడా కంటెంట్ పరంగా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో రానా తో పాటు సాయి పల్లవి, ప్రియమణి మరియు ప్రత్యేక పాత్రలో నివేత పేతురేజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో తన కన్నా సాయి పల్లవి పాత్ర కి ఎక్కువ ప్రాముఖ్యత ఉందని రానా కన్నా ముందు సాయి పల్లవి పేరు పోస్టర్స్ లో వచ్చేలా చూడమని రానా చెప్పారని సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. రానా సమానత్వానికి అంత విలువ ఇస్తారని రానా గొప్పతన్నాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular