fbpx
HomeMovie Newsవెంకటేష్ 'నారప్ప' టీజర్ విడుదల

వెంకటేష్ ‘నారప్ప’ టీజర్ విడుదల

VictoryVenkatest Naarappa TeaserReleased

టాలీవుడ్: విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ్ లో ధనుష్ నటించి సూపర్ హిట్ గా నిలిచిన ‘అసురన్’ సినిమా కి రీ-మేక్ గా ఈ సినిమా రాబోతుంది. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ టీజర్ ఇవాల విడుదల చేసారు. టీజర్ లో కత్తి పట్టుకొని కోపం గా నడుచుకుంటూ వచ్చే లుక్ వుంది. చివర్లో వెంకటేష్ తన స్టైల్ లో కత్తి పట్టుకొని అరిచే ఎమోషన్ విడుదల చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో మణి శర్మ ఇచ్చిన సంగీతం బాగుంది. ఈ సినిమాలో వెంకీ ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక వూర్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే ఒక రైతు గా కనిపిస్తున్నాడు. వెంకటేష్ భార్య పాత్రలో ప్రియమణి నటిస్తుంది.

టీజర్ వరకు చూస్తే కాస్ట్యూమ్స్ తో సహా తమిళ్ అసురన్ సినిమాని దించేసినట్టు కనిపిస్తుంది. బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉన్నది ఉన్నట్టు ఇక్కడ తీసుకచ్చి పెట్టారు. టీజర్ వరకు అయితే పర్లేదు కానీ సినిమా మొత్తం అలానే ఉంటే తమిళ్ లో చూసిన వాళ్ళు తెలుగులో చూడడం కష్టమే. ‘కొత్త బంగారు లోకం ‘ , ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సూపర్ హిట్ లు అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్లాప్ తర్వాత చాలా రోజులుగా తర్వాత ఈ దర్శకుడు ‘నారప్ప’ సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular