fbpx
HomeMovie Newsఆది సాయికుమార్ 'జంగిల్' టీజర్ విడుదల

ఆది సాయికుమార్ ‘జంగిల్’ టీజర్ విడుదల

AadiSaikumar JungleMovieTeaser Released

టాలీవుడ్: తమ వాయిస్ తోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ ఫ్యామిలి నుండి వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ‘ఆది‘. కెరీర్ ప్రారంభం లో వచ్చిన ‘ప్రేమ కావాలి’, ‘లవ్ లీ ‘ తప్ప మరే సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. చాలా గ్యాప్ తీసుకొని ఇపుడు ‘జంగిల్’ అనే సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. జంగిల్ – ‘ఇది శ్వాసిస్తుంది, ఇది దాక్కుని ఉంటుంది, ఇది వేటాడుతుంది’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతుంది. హర్రర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమా టీజర్ కొంత వరకు ఆకట్టుకుంది. ఆది ఇదివరకే ‘నెక్స్ట్ నువ్వే’ అనే సినిమా ద్వారా హర్రర్ జానర్ లో ఒక సినిమా చేసాడు కానీ అది అంతగా ఆకట్టుకోలేదు, ఈ జానర్ లో ఆది కి ఇది రెండవ సినిమా.

కార్తీక్ – విఘ్నేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా , ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ మరియు అర్చనా చందా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కంప్లీట్ అడవి నేపధ్యం లోనే ఈ సినిమా రూపొందింది. టీజర్ వరకు మొత్తం భయపెట్టే అంశాలే చూపించే ప్రయత్నం చేసారు మేకర్స్. జోస్ ఫ్రాంక్లిన్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ జానర్ కి సరిగ్గా సరిపోయింది. ఈ సినిమాలో ఆది కి జోడి గా వేదిక నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కి సిద్ధం గా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular