fbpx
HomeMovie Newsషూటింగ్ మొదలుపెట్టిన 'పుష్ప' టీం

షూటింగ్ మొదలుపెట్టిన ‘పుష్ప’ టీం

AlluArjun PushpaMovie ShootingStarted

టాలీవుడ్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘పుష్ప’. సినిమా ప్రకటన చేసినప్పటినుండి ఈ సినిమా పైన అంచనాలు ఉంటూనే ఉన్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా ఇది. ప్రీ ప్రొడక్షన్ పనులు, షూట్ లొకేషన్లు అన్నీ పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టే సమయానికి కరోనా, లాక్ డౌన్ రావడం తో 7 నెలలుగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ఎదురు చూస్తూనే ఉన్నారు మేకర్స్. ఇపుడు పరిస్థితులు మారకపోయినా అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటుండడం తో.. అన్ని ప్రాంతాల్లో నిబంధనల్ని సడలించడం తో పుష్ప టీం కూడా షూటింగ్ పనులు మొదలు పెట్టేసింది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాల్లోని ‘మేరేడుమిల్లి’ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ పనులు మొదలు పెట్టింది సినిమా టీం. మొదట కేరళ అడవుల్లో షూటింగ్ చేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుమతులు, కాస్టింగ్ మరియు బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని లోకల్ అడవులైన మేరేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ జరపబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ కి జోడీ గా ‘రష్మిక మందన్న’ నటిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడే లారీ డ్రైవర్ ‘పుష్ప రాజ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఇదివరకే విడుదలైన బన్నీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్ అంటే సూపర్ హిట్ ఆల్బం ఊహించవచ్చు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular