fbpx
HomeMovie Newsప్రచారం మొదలు పెట్టిన శర్వా 'శ్రీకారం'

ప్రచారం మొదలు పెట్టిన శర్వా ‘శ్రీకారం’

BhaleBhagundi SongTeaser FromSrikaramMovie

టాలీవుడ్: శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. షూటింగ్ దాదాపు పూర్తి చేసికొని మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శ్రీకారం టీం ప్రయత్నిస్తుంది. విడుదలకి ముందు ప్రొమోషన్ లో భాగంగా సాంగ్ విడుదల చేయబోతుంది ఈ సినిమా టీం. ఈ సినిమా నుండి ‘భలేగుంది బాల’ అనే పాట ప్రోమో ని విడుదల చేసారు ఈ సినిమా మేకర్స్. ఈ పాటని నవంబర్ 9 న విడుదల చేయబోతున్నారు. రాయలసీమ గాయకుడు ‘పెంచల్ దాస్’ ఈ పాటని రాయడం తో పాటు ఆలపించారు కూడా. ఈ సినిమా కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే నిర్మితమవుతుంది.

ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. కిశోరె రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా ఆకట్టుకున్న ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాటని నవంబర్ 9 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించి ఆ సాంగ్ కి సంబందించిన టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా ప్రముఖ రచయిత ‘సాయి మాధవ్ బుర్రా’ మాటలు అందించారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, నరేష్, ఆమని, సప్తగిరి.. తదితరులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular