fbpx
HomeMovie Newsమరో మ్యూజికల్ హిట్ బాటలో దేవి

మరో మ్యూజికల్ హిట్ బాటలో దేవి

EmitoIdhi SongPrelude FromNihtinRangdeMovie

టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు ఒక 15 సంవత్సరాలు టాప్ పోసిషన్ లో ఉండి అద్భుతమైన సంగీతాన్ని, ఎన్నో సూపర్ హిట్ పాటల్ని అందించాడు దేవిశ్రీప్రసాద్ . గత రెండు సంవత్సరాలుగా అంత చెప్పుకోదగిన హిట్స్ ఏమీ లేవు. తాను మ్యూజిక్ చేసిన సినిమాలు హిట్ అయినా కూడా మ్యూజికల్ గా మాత్రం అంతంత మాత్రమే అని చెప్పుకోవచ్చు. దానికితోడు కాపీ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో అభిమానుల్ని పలకరించిన దేవి మ్యూజిక్ పరంగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ అదే టైం లో థమన్ అద్భుతమైన సంగీతం తో దూసుకెళ్తున్నారు.

ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ మళ్ళీ తన పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. దేవి ప్రస్తుతం నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగ్ దే’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఒక రొమాంటిక్ సాంగ్ ‘ప్రీ ల్యూడ్’ ఇవాళ విడుదలైంది. పాట 7 వ తేదీ న విడుదల చేయబోతున్నారు. ఈ ప్రీ ల్యూడ్ వినగానే ఆకట్టుకుంటుంది. ఇది విన్నాక దేవి తన పాత రోజులు గుర్తుచేశాడు. దేవి కెరీర్ బిగినింగ్ లో మన్మధుడు, కలుసుకోవాలని, ఆర్య లాంటి అద్భుతమైన ప్రేమ కథలకి మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి కూడా అదే రేంజ్ ఉండబోతున్నట్టు హింట్స్ ఇస్తూ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular