fbpx
HomeMovie Newsహైదరాబాద్ మెట్రో లో సందడి చేసిన 'వకీల్ సాబ్'

హైదరాబాద్ మెట్రో లో సందడి చేసిన ‘వకీల్ సాబ్’

VakeelSaab Pawankalyan InHyderabadMetro

హైదరాబాద్: సినిమాలు వదిలేసి రాయకీయాల్లోకి వెల్లి మళ్ళీ సినిమాలతో రీ-ఎంట్రీ ఇస్తున్న హీరో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కంబ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించి మెప్పించిన ‘పింక్’ సినిమాకి ఇది అఫీషియల్ రీ-మేక్. కరోనా కి ముందే చాలా భాగం షూటింగ్ పూర్తి అయినా సినిమా మిగతా పార్ట్ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా నిన్ననే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కరోనా లేకపోయి ఉంటె సమ్మర్ లోనే ఈ సినిమా విడుదల అయ్యేది.

ఈ సినిమా షూట్ కోసం పవన్ కళ్యాణ్ మాదాపూర్ నుండి మియాపూర్ వరకు హైదరాబాద్ మెట్రో లో ప్రయాణించాడు. పవన్ కళ్యాణ్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నాడు. పవన్ షూట్ లో భాగం గా నల్ల కోటు ధరించి లాయర్ గెటప్ లో ఉన్నాడు. ఈ ప్రయాణంలో తోటి ప్రయాణికులతో కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటించాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ఓహ్ మై ఫ్రెండ్’, ‘ఎంసిఏ’ సినిమాలకి దర్శకత్వం వహించిన ‘వేణు శ్రీరామ్’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్, నివేత థామస్, అంజనీ , అనన్య మరి కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular