fbpx
HomeMovie Newsషూట్ లో జాయిన్ అయిన 'వకీల్ సాబ్'

షూట్ లో జాయిన్ అయిన ‘వకీల్ సాబ్’

Pawankalyan Joins VakeelSaabShooting

టాలీవుడ్: సినిమాలు వదిలేసి రాయకీయాల్లోకి వెల్లి మళ్ళీ సినిమాలతో రీ-ఎంట్రీ ఇస్తున్న హీరో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించి మెప్పించిన ‘పింక్’ సినిమాకి రీ-మేక్ గా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ చేసిన పాత్రలోనే పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ఇంకో 20 -25 రోజుల్లో షూటింగ్ ముగుస్తుందనగా లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఈ మధ్యనే షూటింగ్ పునః ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. మొన్నటి వరకు దీక్ష లో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ మార్చి నల్ల కోటు ధరించి లాయర్ గెటప్ లోని కొన్ని ఫొటోస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.

వరుసగా సినిమాలు ప్రకటించి ఆశ్చర్య పరచిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యి ఒక్కొక్కటి ముగించే పనిలో పడ్డాడు. ఒక 20 రోజుల్లో వకీల్ సాబ్ పెండింగ్ పార్ట్ పూర్తి చేసి క్రిష్ సినిమా పనుల్లో లీనం అవనున్నాడు.వకీల్ సాబ్ ని 2021 సంక్రాతి వారికి సిద్ధం చేసి థియేటర్ లలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్రిష్ సినిమా కోసం మూడు నెలలు కాల్షీట్లు ఇవ్వబోతున్నట్టు టాక్ ఉంది. ఈ సినిమాని 2021 సమ్మర్ కి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. దీని తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular