fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsవరుసగా సినిమాలు చేస్తున్న 'ఆహా'

వరుసగా సినిమాలు చేస్తున్న ‘ఆహా’

Aha Planning HugeContent

టాలీవుడ్: 100 పర్సెంట్ తెలుగు కంటెంట్ అని మొదలు పెట్టిన ‘ఆహా’ మొదట్లో కొంచెం తడబడింది. కొన్ని పాత సినిమాలు.. అవి కూడా వేరే ఓటీటీల్లో ఉన్నవే. మొదట్లో రెండు మూడు వెబ్ సిరీస్ లు మొదలుపెట్టినా కూడా అవి అంతగా క్లిక్ అవలేదు. లాక్ డౌన్ వచ్చినప్పటినుండి ఈ ఓటీటీ పుంజుకుంది. రెండు కొత్త సినిమాలు విడుదల చేయడంతో పాటు మలయాళం లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నిటిని తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి వీక్షకులని పెంచుకుంది. దేశం లో అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత వరుస ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వదులుతుంది. వాటితో పాటు కొన్ని కేజ్రీ సినిమాలని కొని విడుదల చేస్తుంది.

ఈ మధ్యనే ఆహా లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమా తెలుగు లో ఓటీటీ ల్లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీటితో పాటు RX100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమా సిద్ధం చేసారు. ఈ సినిమాని నవంబర్ 13 నుండి ఆహా లో అందుబాటులో ఉంచుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాతో హిట్ కొట్టిన ‘సిద్దు జొన్నలగడ్డ’ తో ‘మా వింత గాధ వినుమా‘ అనే రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ ని రూపొందించి అది కూడా నవంబర్ 13 న దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు. వీటితో పాటు పునర్నవి తో ‘కమిట్ మెంటల్’ అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. వైవా హర్ష తో ఒక టాక్ షో కూడా ప్లాన్ చేసారు. ఇలా మెల్ల మెల్లగా ఒక్కో అడుగు ముందుకేస్తూ భారీ కంటెంట్ తో ఆహా దూసుకెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular