fbpx
HomeMovie News'మా వింత గాధ వినుమా' టీజర్ విడుదల

‘మా వింత గాధ వినుమా’ టీజర్ విడుదల

MaaVinthaGaadhaVinuma Teaser Released

టాలీవుడ్: ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా తో లక్డౌన్ లో ఓటీటీ లో సందడి చేసిన సిద్దు జొన్నలగడ్డ మరో సినిమాతో పలకరించనున్నాడు. సిద్దు , సీరత్ కపూర్ మరోసారి జంటగా నటించిన సినిమా ‘మా వింత గాధ వినుమా’. లవ్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీ లో విడుదల అవబోతోంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాని నవంబర్ 13 నుండి ఓటీటీలో అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ సినిమాని సిల్లీ మాంక్స్ స్టూడియోస్ , ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్ , మెలోడ్రామా స్టూడియోస్ బ్యానర్ పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, జి. సునీత, కీర్తి చిలుకూరి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఆదిత్య మండల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

సినిమాకి సంబందించిన టీజర్ ఇవాళ నాచురల్ స్టార్ నాని విడుదల చేసాడు. ఈ సినిమాకి హీరో సిద్దు జొన్నలగడ్డ రచన సహకారం తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాలో సిద్దు హైదరాబాద్ కుర్రాడిగా నటిస్తూ హైద్రాబాదీ స్లాంగ్ ఎక్కువగా వాడుతాడు. సినిమా ట్రైలర్ లో అది కనిపిస్తుంది. యూత్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కడం తో పాటు లవ్, ఎమోషనల్ మరియు ఫామిలీ అట్టాచ్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు టీజర్ ని చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, కల్పిక, కమల్ కామరాజు, వైవా హర్ష మరికొందరు సీనియర్ నటులు నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular