fbpx
HomeMovie Newsసుమంత్ 'కపటధారి' టీజర్

సుమంత్ ‘కపటధారి’ టీజర్

Sumanth Kapatadhaari TeaserReleased

టాలీవుడ్: అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘కపటధారి’. చాలా కాలంగా సక్సెస్ లేక వెనుకపడి ఈ మధ్యనే ‘మళ్ళీ రావా’ లాంటి క్లాస్ సినిమా తీసి పరవాలేదనిపించాడు. ఆ తర్వాత సుబ్రమణ్యపురం అని ఒక సినిమా తీసినా అది అంత ఆకట్టుకోలేదు. ఇపుడు ఒక థ్రిల్లర్ జానర్ కథతో మన ముందుకు వస్తున్నాడు సుమంత్. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ ఈ సినిమాని నిర్మించారు. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 లో కన్నడ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచినా ‘కవలుదారీ’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఈరోజు విడుదలైంది.

ఈ సినిమాలో జరిగే హత్యల వెనక ఒక తెలియని కోణం ఉందని ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగం పంచుకుంటానని ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్న సుమంత్ ప్రయత్నిస్తుంటాడు. కానీ రెగ్యులర్ క్రైమ్ పోలీసులు అది అనుమతించారు. దాంతో తన మార్గంలో తాను ఆ మర్డర్ మిస్టరీ ని చేజ్ చేసే పనిలో ఉంటాడు హీరో. “రంగులు మార్చే లోకం.. పాచికలాడే న్యాయం.. నీతీ నియమం మరిచి.. జీవితమంటే యుద్ధం.. పోరాడటమే లక్ష్యం.. కన్నులు కప్పి తిరిగేవాడేరా.. కపటధారి” అంటూ వచ్చే సాంగ్ సినిమా నేపధ్యాన్ని చెపుతుంది. ఈ సినిమాలో సుమంత్ కి జోడీ గా నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. నాజర్, జయప్రకాష్, సుమన్ రంగనాథ్ ,వెన్నెల కిషోర్, సంపత్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది త్వరలో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular