fbpx
HomeMovie Newsసుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' ఫస్ట్ లుక్

సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫస్ట్ లుక్

Sudheerbabu SrideviSodaCenter FirstLook

టాలీవుడ్: లాక్ డౌన్ లో ఓటీటీ లో విడుదలైన ‘వి’ సినిమా అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రానప్పటికీ సుధీర్ బాబు కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ హీరో ‘పలాస 1978 ‘ దర్శకుడు కరుణ కుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల చేసారు ఈ సినిమా మేకర్స్. ఈ సినిమా పేరు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఎలెక్ట్రిషియన్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ‘మనోడు లైటింగ్ పెడితే ఊరంతా మెరిసిపోద్ది’ అనే టాగ్ లైన్ తో ఈ సినిమా రాబోతోంది.

ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఒక పల్లెటూరి నేపధ్యం అని అర్ధం అవుతుంది. పలాస 1978′ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా మరో వైవిధ్యమైన ప్రయత్నం చేయబోతున్నట్టు టైటిల్, మోషన్ పోస్టర్ ద్వారా అర్ధం అవుతుంది. ’70 MM ఎంటర్టెయిన్మెంట్స్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ బ్యానర్ లో సుధీర్ కి ఇది రెండవ సినిమా. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular