fbpx
HomeTop Movie Newsయావరేజ్ టాక్ తో నాట్యం సినిమా!

యావరేజ్ టాక్ తో నాట్యం సినిమా!

NATYAM-GETS-AVERAGE-TALK

దిటూస్టేట్స్ మూవీడెస్క్: క్లాసిక్ డ్యాన్స్ నేపథ్యంలో విడుదలైన చిత్రం నాట్యం. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు రేవంత్ కోరుకొండ. ఈ నెల 22వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం రివ్యూ ఇలా ఉంది.

కథ నేపథ్యం:

నాట్యం అనే ఒక గ్రామానికి చెందిన సితార (సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. తాను ఎప్పటికైన ఒక గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని ఆమె చిన్నప్పటి నుండే కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది సితార.

చిత్రంలో ప్రధాన పాత్ర అయిన సితార తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు. యాక్టింగ్‌ పరంగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ డాన్స్‌ విషయంలో మాత్రం అదరగొట్టింది. స్వతహాగా ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం. గురువుగారిగా ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు.

ఇక చిత్రంలో క్లాసికల్‌ డ్యాన్సర్‌ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్‌ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో బాగా మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్‌, హీరోయిన్‌ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర న్యాయం చేశారు.

తెలుగు చిత్రాల్లో నాట్యమే ప్రధాన కథగా అప్పట్లో చాలా సినిమాలే వచ్చాయి. అలంటి చిత్రాలను ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. అయితే ఇటీవలి కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా మొదటి హాఫ్‌ అంతా చాలా సింపుల్‌గా సాగినప్పటికీ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై మంచి ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది. కాగా సెకండాఫ్‌ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది అంతగా వర్కవుట్‌ కాలేదని అభిప్రాయం వినిపిస్తోంది. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి.

అయితే సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాకు పెద్ద హైలెట్‌. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular