fbpx
Friday, April 26, 2024
HomeTop Movie Newsమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీ రివ్యూ!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీ రివ్యూ!

MOSTELIGIBLE-BACHELOR-MOVIE-REVIEW-BAGS-AVERAGE-TALK

మూవీడెస్క్:

సినిమా టైటిల్‌: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్!‌
తారాగణం: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెట‌ప్ శ్రీను, ముర‌ళీ శ‌ర్మ‌, త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌
సంగీతం : గోపీ సుంద‌ర్‌
విడుదల తేది : అక్టోబర్ 15, 2021

అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు హ‌ర్ష‌(అఖిల్‌), అక్కడే ఒక మంచి ఇల్లు కొని దానితో పాటు ఖ‌రీదైన వ‌స్తువుల‌న్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఇక పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌రువాయి అనుకుని ఒక మంచి జోడీని వెతుక్కునేందుకు హైద‌రాబాద్ కు వ‌స్తాడు. ఎంతోమంది అమ్మాయిలను చూసి అందులో ఒక‌రైన విభ‌(పూజా హెగ్డే) ను ఇష్ట పడతాడు. కానీ ఆమె ఫ్యామిలీ మెంబ‌ర్స్ హ‌ర్ష‌ను రిజెక్ట్ చేస్తారు.

ఐతే నో చెప్పడానికి ప్రధాన కారణం ఆమెకు పెళ్ళి మీద ఇంట్ర‌స్ట్ లేద‌న్న విషయం హ‌ర్ష‌కు తెలుస్తుంది. అస‌లు విభ‌కు పెళ్లంటే ఎందుకు విర‌క్తి? ఆమెను త‌న‌తో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే ప‌రిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా ప్రధాన నేపథ్యం!

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఎప్పుడూ చిన్న లైన్‌తోనే సినిమా తీయాల‌నుకుంటాడు. క‌థ కంటే క‌థనం మీద ఎక్కువ దృష్టి పెడతాడు, కానీ ఈసారి మ‌ళ్లీ పాత ఫార్మెట్‌ను ఫాలో అయ్యి కాస్త ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇక చూపించిందే చూపించి జ‌నాల‌కు విసుగు పుట్టించాడు డైరెక్ట‌ర్‌. సుమారు ప‌దిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడ‌టం, ప్ర‌శ్న వేయ‌డం, రిజెక్ట్ కావ‌డం.. అంతా ఇదే తంతు.. ఇది చూసిన‌ప్పుడు షాదీ ముబార‌క్ సినిమా గుర్తుకు రాక మాన‌దు.

ఫ‌స్టాఫ్‌లోని కొన్ని స‌న్నివేశాలు సిద్ధార్థ్ నటించిన బొమ్మ‌రిల్లు సినిమా లాగానే సాగుతాయి, మొత్తానికి ఫ‌స్ట్ భాగం అద‌ర‌హో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించ‌క మాన‌దు. సెకండాఫ్‌లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన త‌ప్పిదాలే ఇక్క‌డ కూడా సుస్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. అంతేకాకుండా ప్ర‌తిదాన్ని సాగ‌దీసి ప్రేక్ష‌కుల‌కు తెగ బోర్ కొట్టించారు.

క్లైమాక్స్ కూడా ఊహ‌కంద‌నంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెద‌వి విరుస్తారు. ఇంట‌ర్వెల్ సీన్‌, కోర్టు స‌న్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. రెండు, మూడు పాట‌లు బాగున్నాయి. అయితే సినిమాను మ‌రీ భూత‌ద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్‌, గీతా గోవిందం, మిస్ట‌ర్ మ‌జ్ను, బొమ్మ‌రిల్లు, షాదీ ముబార‌క్‌ల‌ను మిక్స్ చేస్తే వ‌చ్చిన మిశ్ర‌మ ఫ‌లితంలా అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular