దుబాయ్: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 144 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలోనే తమ లక్ష్యాన్ని ఛేరుకుంది.
సౌతాఫ్రికా టీం కెప్టెన్ బవుమా చాలా తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ ఇంకో ఓపెనర్ అయిన రీజా హెండ్రిక్స్(39) రాణించి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. దాని తర్వాత ఎయిడెన్ మార్క్రమ్(51 నాటౌట్), వాన్ డర్ డస్సెన్(43 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
వెస్టిండీస్ బౌలర్లలో హొస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన నోర్జే(1/14)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకు ముందు విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో చెలరేగగా, కేశవ్ మహారాజ్ 2, నోర్జే, రబాడ తలో వికెట్ పడగొట్టారు.