fbpx
HomeTelanganaతెలంగాణ బడ్జెట్‌లో త్వరలో నిరుద్యోగ భృతి

తెలంగాణ బడ్జెట్‌లో త్వరలో నిరుద్యోగ భృతి

TELANGANA-TO-IMPLEMENT-UNEMPLOYMENT-ALLOWANCE-SOON

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నుండి కరోనా కష్టకాలంలో రాష్ట్ర నిరుద్యోగులకు త్వరలో శుభవార్త అందించనుంది. రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగభృతి అనే కొత్త అంశం చేరబోతోంది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లింపునకు సిద్ధమవుతోంది.

రాబొయే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో నిరుద్యోగభృతికి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిసారిగా నిరుద్యోగభృతి పద్దు కింద రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాలు తెలుపుతున్నాయి. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.

ఎన్నికలు అయిపోయాక ప్రభుత్వం దీని అమలు గురించి పట్టించుకోక పోవడంతో రెండేళ్లుగా ఈ హామీ మరుగునపడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లించనుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్‌ ఓ ప్రకటన చేస్తారని ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కూడా ప్రకటన చేయడంతో ఈ హామీ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ పథకానికై లక్షలమంది నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఆశలు పెట్టుకుని ఉన్నారు. వీరిలో ఎంతమంది నిరుద్యోగభృతికి అర్హులు? ఎవరు కాదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం రూపొందించనున్న విధివిధానాల్లో జవాబు లభిస్తుంది. విధివిధానాల రూపకల్పన, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసే అవకాశముంది.

ఆ తర్వాతే ఈ పథకం అమలుపై మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది అన్న అంశంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular