fbpx
HomeTelanganaతెలంగాణలో టీ హబ్ 2.0ను ప్రారంభించిన కేసీఆర్!

తెలంగాణలో టీ హబ్ 2.0ను ప్రారంభించిన కేసీఆర్!

KCR-INAUGURATES-THUB-2.0-IN-HYDERABAD

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ టీ హబ్‌ ఫేజ్‌ 2ను ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది.

ఈ టీ హబ్ 2.0లో దాదాపు రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. టీ హబ్‌ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరణలో నిర్మించబడింది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.

భారత్ లో స్టార్టప్ ఏకో సిస్టం ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని హామీని ఆయన ఈ సందర్భంగా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular