పారిస్: భారత్ తరుపున ఒలింపిక్ క్రీడల్లో బిహార్ మహిళ ఎమ్మెల్యే… ఒలింపిక్ క్రీడలు ఇప్పటికే ఆరంభమయ్యాయి.
భారత్ తరఫున 117 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. వారిలో బిహార్‌కు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే కూడా పాల్గొనడం విశేషం. బిహార్‌లోని జముయ్ ఎమ్మెల్యేగా గెలవకముందే శ్రేయస్ సింగ్ షూటింగ్ క్రీడాకారిణి.
శ్రేయస్ సింగ్ షూటింగ్ రంగంలో అర్జున అవార్డును పొందింది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ విభాగంలో రజత పతకం సాధించింది.
2018 గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
శ్రేయస్ సింగ్ దిల్లీలోని హన్స్ రాజ్ కాలేజీ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ చదివింది. ఆమె స్వస్థలం గిదౌర్.
2020లో జరిగిన బిహార్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ ప్రకాష్‌పై 41 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్, తాతా సెరేందర్ సింగ్ ఇద్దరూ రైఫిల్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా వ్యవహరించారు.
జముయ్ నియోజకవర్గం నుంచి దిల్లీకి 1217 కిలోమీటర్ల దూరం ఉంది.
ఒలింపిక్ శిక్షణ శిబిరానికి వెళ్లి రావడానికి శ్రేయస్ సింగ్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
ప్రస్తుతం శ్రేయస్ సింగ్ జముయ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది.
ఒక యువ క్రీడాకారిణిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఇవాళ ఒలింపిక్స్‌లో పాల్గొనడం గొప్ప విషయమని చెప్పాలి. పలువురు మేధావులు శ్రేయస్ సింగ్ ఎలాగైనా బంగారు పతకం సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శ్రేయస్ సింగ్ తన క్రీడా ప్రయాణం ద్వారా ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన వ్యక్తిగత జీవితం, రాజకీయ భవితవ్యం, మరియు క్రీడా రంగంలో ఎన్నో విజయాలను సాధించడం ద్వారా, ఆమె సామర్థ్యాన్ని సాక్షాత్కారంచేసింది.
బిహార్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్‌గా, ఆమె ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచింది.