fbpx
HomeMovie Newsఆహా లో తమన్నా వెబ్ సిరీస్

ఆహా లో తమన్నా వెబ్ సిరీస్

TamannaStarrer 11thHour WebseriesFromAha

టాలీవుడ్: గత పది సంవత్సరాలుగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టు డిజిటల్ ప్రపంచం లోకి కూడా అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం వెబ్ కంటెంట్ కి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న తమన్నా వెబ్ కంటెంట్ తో మొదటి సారి మన ముందుకు వస్తుంది. తెలుగులో ‘ఒక రొటీన్ లవ్ స్టోరీ’, ‘గుంటూరు టాకీస్’, ‘చందమామ కథలు’, ‘psv గరుడవేగా ‘ సినిమాలని డైరెక్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు.

100 పెర్సెంట్ తెలుగు కంటెంట్ తో దూసుకెళ్తున్న ఆహా వారు ఈ వెబ్ కంటెంట్ ని తమ ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా తమన్నా ద్వారా ఆహా లో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది అన్న వార్తలకి ఈ ప్రకటన తో చెక్ పడింది. ప్రస్తుతం ఆహా వాళ్ళు భారీ కంటెంట్ తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ని అల్లు అర్జున్ తీసుకొని ఆహా లో స్ట్రీమ్ చేయబోతున్నారు. ’11th అవర్ ‘ అనే పేరుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో ఆహా లో రాబోతుంది అని చెప్పారు. విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular