fbpx
HomeMovie Newsసూర్య 'జై భీమ్' ఫస్ట్ లుక్

సూర్య ‘జై భీమ్’ ఫస్ట్ లుక్

Surya JaiBheem FirstLook

కోలీవుడ్: ఘజిని సినిమాతో తెలుగులో సూపర్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ నటుడు సూర్య. సూర్య నుండి సినిమా వస్తుందంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు ఏర్పడుతాయి. అందుకే సూర్య కూడా ఇక్కడి తెలుగు అభిమానుల కోసం ఎప్పటినుండో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు సూర్య పుట్టిన రోజు సందర్భంగా సూర్య సినిమాలకి సంబందించిన ప్రకటనలు చేస్తున్నారు. నిన్ననే సూర్య 40 వ సినిమాగా రూపొందుతున్న ‘ఎత్తారెక్కుమ్ తునిందవన్’ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ప్రకటించారు. ఈ రోజు సూర్య నటించనున్న 39 వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

అశోక్ సెల్వన్ హీరోగా ‘కుత్తట్టిల్ ఓరుదన్’ సినిమాని డైరెక్ట్ చేసిన టీ.జె.జ్ఞానవేల్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. స్వతహాగా ఇదివరకే జర్నలిస్ట్ గా పని చేసిన జ్ఞానవేల్ ఈ సినిమాతో ట్రైబల్స్ కి సంబందించిన సమస్యల్ని తెర మీదకి తీసుకురానున్నట్టు ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైబల్స్ హక్కుల కోసం పోరాడే లాయర్ పాత్రలో సూర్య నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ ద్వారా అర్ధం అవుతుంది. ‘కర్ణన్’ లో హీరోయిన్ గా నటించిన రాజీషా విజయన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సీన్ రొల్డన్ సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది. 2d ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య మరియు జ్యోతిక ఈ సినిమాని నిర్మించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular