fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsషూటింగ్ పూర్తి చేసుకున్న నాని 'శ్యామ్ సింఘరాయ్'

షూటింగ్ పూర్తి చేసుకున్న నాని ‘శ్యామ్ సింఘరాయ్’

ShyamSingharay Shoot Finished

టాలీవుడ్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తున్నాడు. నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో హిట్ కాంబినేషన్ లో ‘టక్ జగదీశ్’ సినిమాని పూర్తి చేసి విడుదలకి సిద్ధంగా ఉంచాడు. థియేటర్లలో జనాల రెస్పాన్స్ చూసి వచ్చే రెండు వారాల్లో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. ఇపుడు మరో సినిమాని కూడా షూటింగ్ పూర్తి చేసేసాడు. ‘టాక్సీ వాలా‘ సినిమాని రూపొందించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘శ్యామ్ సింఘరాయ్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. హైదరాబాద్ లోనే సెపెరేట్ సెట్ రూపొందించి సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపారు.

ఈ రోజు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు తెలిపారు నాని. ఒక పీరియాడిక్ కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని కి జోడీ గా సాయి పల్లవి మరియు కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తి అవగానే తన లుక్ ని మార్చేసి మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నట్టు నాని ఒక వీడియో కూడా విడుదల చేసారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరు రా’ లాంటి హిట్ సినిమాలని రూపొందించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా షూట్ లో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సినిమాతో మలయాళీ హీరోయిన్ నజ్రియా నజిమ్ తెలుగులో పరిచయం అవుతుంది. వరుస సినిమాలు చేస్తూ మరో కరోనా వేవ్ లేకపోతే ఈ సంవత్సరంలో మూడు సినిమాలని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular